29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తా రోడ్డులో గల  సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆప్  జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం నుండి తెలంగాణలో జరిగే బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా క్లబ్ తరఫున ఘనంగా నిర్వహిస్తామని జేమ్స్ క్లబ్ నిజాంబాద్ అధ్యక్షులు నరసింహారావు పాకాల తెలిపారు. పండగ యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేస్తామని, మన సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా పాటించే విధంగా ఈ విధంగా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపాల్ లతా గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Bathukamma celebrations at St. Xavier's High School

More articles

Latest article