నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బక్రీద్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు గురువారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

