23.2 C
Hyderabad

నగరంలో పట్టపగలు చోరి

Daylight theft in the city

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నగరంలోని 4వ టౌన్ పరిధిలో వినాయక్ నగర్ లో పట్టపగలు చోరి జరిగింది. దత్తాత్రేయ ఆలయ సమీపంలో గురువారం ఇంటికి తాళం వేసిన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తాళం పగలగొట్టడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 4వ టౌన్ ఎస్ హెచ్ వో సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో 8 తులాల బంగారు నగలు, 40 తులాల పైగా వెండి, రూ.10 వేల నగదు చోరికి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.

More articles

Latest article