27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . న్యాక్ ద్వారా శిక్షణ – ఉపాధి కల్పన కార్యక్రమం

 

. . . సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నేష్నల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో మూడు నెలల శిక్షణ కార్యక్రమం ప్రారంభించబడుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల శిక్షణ కాలానికి గాను రూ. 18,000 రుసుము ఉండగా, జిల్లా యంత్రాంగం తరపున 50 శాతం రాయితీని కల్పిస్తామని అన్నారు. అభ్యర్థులు కేవలం రూ. 9000 రుసుము(నెలకు మూడు వేల చొప్పున) మాత్రమే చెల్లించి, పై ట్రేడ్ లలో శిక్షణ పొందవచ్చని సూచించారు. శిక్షణ కాలంలో అనుభవజ్ఞులైన ట్రైనర్లచే అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రాక్టికల్స్ తో పాటు థియరీలో నాణ్యమైన శిక్షణ అందించబడుతుందని అన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయని కలెక్టర్ తెలిపారు. శిక్షణ సందర్భంగా ఉచిత యూనిఫామ్, ఉచిత స్టేషనరీ, అధునాతన, సాంకేతికతతో కూడిన యంత్ర పరికరాలతో ప్రాక్టికల్ ట్రైనింగ్, అనుభవజ్ఞులైన ఇన్స్ట్రక్టర్లచే సమర్ధవంతమైన శిక్షణ, న్యాక్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికేట్ అందిచబడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు కలిగిన న్యాక్ సంస్థ ద్వారా ఇదివరకు వివిధ ట్రేడ్లలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పూర్తి స్థాయిలో 100 శాతం ఉపాధి అవకాశాలు కల్పించబడినాయని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. శిక్షణ తరగతులను న్యాక్ అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ జరుపుతారని, అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందేలా కృషి చేస్తారని అన్నారు. పదవ తరగతి ఆ పై విద్యార్హతలు కలిగి ఉండి, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ, యువకులు ప్రస్తుతం ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో మూడు నెలల శిక్షణ పొందేందుకు అర్హులని సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు 2026 జూన్ 09వ తేదీ లోపు నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో గల న్యాక్ కేంద్రంలో నేరుగా దరఖాస్తులను అందించవచ్చని అన్నారు. వివరాలకు న్యాక్ కేంద్రం సహాయ సంచాలకులు లింబాద్రి, సెల్ నెంబర్:  9296507557 ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

More articles

Latest article