28.2 C
Hyderabad

నేడు ఆసియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత్–పాకిస్తాన్ ఢీ

India and Pakistan clash in the Asian Games men's cricket final today.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

 

. . .  అందరిచూపు బుడ్డోడు వైభవ సూర్యవంశీ వైపే

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఆసియన్ గేమ్స్ క్రికెట్‌లో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరు శనివారం జరగనుంది. స్వర్ణ పతకం కోసం భారత్–పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కీలకమైన ఫైనల్‌లో భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ కీలక సమరంలో అందరి చూపు ఇప్పుడు బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ వైపే ఉంది. అతడి బ్యాట్ నుంచి ఎలాంటి సంచలన ఇన్నింగ్స్ వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు, నేడు కూడా సమష్టి ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో ఫైనల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి బంతి, ప్రతి పరుగు ఉత్కంఠను పెంచే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంతో స్వర్ణ పతకాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

More articles

Latest article