… ముగ్గురు మహిళలు దుర్మరణం
… క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలింపు
వికారాబాద్, బతుకమ్మ:
వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి ఘాట్ రోడ్ లో ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటన జరిగినప్పుడు స్థానికులు సత్వరం స్పందించడం గమనార్హం. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు విచారిస్తున్నారు.

