- మతం మారెందుకు యత్నించిన నాలుగు కుటుంబాలు
- సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల అంబం గల్లిలో మత మార్పిడికి గురి అవుతున్న కుటుంబాలను బుధవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, గణేష్ లు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా మత ప్రచారంలో భాగంగా నాలుగు కుటుంబాలను లోబరుచుకొని మత మార్పిడి చేసే ప్రయత్నం చేసిన సమాచారం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు బుధవారం అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నాయకులు పార్వతీ మురళి, ప్రశాంత్ గౌడ్ లు మాట్లాడుతూ.. అమాయకులు, నిరుపేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఆర్ధికంగా రోగాలు నయమవుతాయని ఆశ చూపి మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మార్పిడికి పాల్పడుతూ.. ఓ ఇంట్లో ప్రార్ధనలు చేసే సమయంలో హిందూ సంఘాలు అడ్డుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మత మార్పిడి సరైంది కాదని నచ్చజెప్పారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అక్కడి నుండి పంపించివేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు సూర్యకాంత్, వడ్ల సాయినాథ్, శివ, గంగుల్, బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
