27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

దుబాయ్ రోడ్డు ప్రమాదం లో అమ్ధాపూర్ వాసి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట సుదర్శన్ కుమారుడు చింతకుంట హరికృష్ణ(38) అనే  వ్యక్తి దుబాయ్ లో రోడ్డు ప్రమాదం లో మరణించాడు.బ్రతుకు తెరువు కోసం అక్టోబర్ 24 వ తేదీన దుబాయ్ లో గల ట్రాన్స్ గార్డ్ కంపెనీ లో క్లీనర్ గా పని చేస్తున్నాడు. అక్టోబర్ 31వ తేదీన రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఆయన మరణించడం జరిగింది అని ఈ నెల 7వ తేదీన కుటుంబ సభ్యులకు కంపెనీ యాజమాన్యం తెలియజేశారు. మృతదేహం గురువారం మృతుని స్వగ్రామానికి చేరుతుందని సన్నిహితులు తెలిపారు.మృతునికి భార్య,  ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద, అండగా ఉండే వ్యక్తి మరణించడం తో ఇటు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నిరవుతున్నారు. దుబాయ్ కి బతుకు తెరువు కోసం వెళ్లి మరణించిన వ్యక్తి  నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

Amdhapur resident dies in Dubai road accident

More articles

Latest article