తెరచుకోనున్న బాబ్లీ గేట్లు

0 19,676
  • ఎగువ ప్రాంతంలో వెలవెల బోతున్న ప్రాజెక్టులు

 

మెండోరా, బతుకమ్మ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎక్కువ భాగాన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మంగళవారం ఎత్తడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సిద్ధమవుతున్నారు. మా రాష్ట్ర లోని ధర్మబాద్ స బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన గేట్లను ఎత్తి అక్టోబర్ 28న మూసివేయాలి. అంతేకాకుండా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని కి బదులు మార్చి ఒకటి నా బాబ్లీ గేట్లెత్తి 0.6 టిఎంసి నీటిని ఎస్సారెస్పీకి అందించాలని తీర్పులో పేర్కొన్నారు. గేట్లు ఎత్తివేత కార్యక్రమంలో ఎస్ ఆర్ ఎస్ పి ఎస్ సి శ్రీనివాస్ గుప్తా ఈ చక్రపాణి అధికారులు పాల్గొననున్నారు. ఎగువన ఉన్న విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టులు సైతం తక్కువ నీటితో దర్శనమిస్తున్నట్లు సమానా చారం. బాబ్లీ ప్రాజెక్టులో సైతం నీరు అంతగా లేకపోవడంతో గేట్లు ఎత్తడంతో నీరు వచ్చే అవకాశం ఉండదని దీంతో ఎస్సారెస్పీలోకి ఇప్పుడే వరద రాదని అధికారులు చెప్తున్నారు. బాబ్లీకి ప్రధాన వరద నీ అందించే ఆముదూర బ్యారేజీలో సైతం ప్రస్తుత నీరు నిలువలేదు. జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు నెల రోజుల్లో 4.485 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు అధికారులు గణంకాలు తెలుపుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.