10 మంది కార్మికులు మృతి
సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. . పేలుడు దాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోయింది. మరో భవనానికి బీటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందారు.
కార్మికులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి: సీఎం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
