హైదరాబాద్, బతుకమ్మ : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూశారు. హైదరాబాద్ లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్ ప్రసిద్ధి. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. ఖైరతాబాద్ లోని ఆయన ఇంటిలో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 9గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
