25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

భూ భారతి భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామంలో బుధవారం భూ భారతి భూముల రీ-సర్వేపై రైతులు, భూ యజమానులకు అవగాహన కల్పించే ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రీ – సర్వే ప్రక్రియ ద్వారా భూముల హద్దులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖచ్చితంగా నిర్ధారించి, భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించనున్నట్లు తెలిపారు. భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు రీ-సర్వే సమయంలో పూర్తిగా సహకరించాలని, అవసరమైన భూ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు. ఈ రీ-సర్వే ద్వారా భూ వివాదాలు తగ్గి, ఖచ్చితమైన రికార్డులు రూపొందించడంలో సహాయపడుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, రైతులు, భూ యజమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article