భూ భారతి భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సు
భీంగల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామంలో బుధవారం భూ భారతి భూముల రీ-సర్వేపై రైతులు, భూ యజమానులకు అవగాహన కల్పించే ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రీ - సర్వే ప్రక్రియ ద్వారా భూముల హద్దులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖచ్చితంగా నిర్ధారించి, భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించనున్నట్లు తెలిపారు. భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు రీ-సర్వే సమయంలో పూర్తిగా...