27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ నేతల చేతగానితనం వల్ల జిల్లా నష్టపోతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దమ్ముంటే రాజీనామా చేసి ఆర్మూర్ లో పోటీ చేయు

 

. . . పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై ఎమ్మెల్యే పైడి రాకేష్ ఫైర్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ నాయకుల చేతగానితనం వల్లే నిజామాబాద్ నష్టపోతుందని, ఢిల్లీలో పైరవీలు పదవులు తెచ్చుకోవడం కాదు జిల్లా అభివృద్దికి ఏం చేశామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో పైడి రాకేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలువని మహేష్ కుమార్ గౌడ్ దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గెలువాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు చెందిన నాయకులు రాష్ట్రంలో పెద్ద పదవులు ఉన్నా జిల్లాకు ఒరిగిందేమి లేదని, ఆర్మూర్ లో ఫామ్ అయిల్ ఫ్యాక్టరి ఏర్పాటుకు కసరత్తు చేస్తుంటే కొడంగల్ కు తరలించడమేమిటని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న చక్కర ఫ్యాక్టరిని తెరిపించలేని అసమర్థులు కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేయడం తప్పితే అభివృద్ది  చేయడం చేతగాదని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. కార్యకర్త నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయిన నితిన్ ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు. ప్రతీసారి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని  విమర్శించడం తప్ప తెలంగాణ ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు ముఖ్యంగా యువత పొట్ట చేతపట్టుకుని గల్ప్ పట్టినా వారికి ఉపాధి చూపించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆడబిడ్డలు బీడీ పరిశ్రమను నమ్ముకుంటే వారి బ్రతుకులు పొగచురుతున్న పట్టించుకునే నాథుడే లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెబుతున్న యూరియా  యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు బొబ్బి వేణు గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, ఆమందు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article