28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ : రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివకుమార్ మాట్లాడారు. రాంగ్ రూట్ లలో వాహనాలు నడపడం గాని, హెల్మెట్లు, సీట్ బెల్టు లేకుండా వాహనాలను నడపవద్దని తెలిపారు. వాహనాల యొక్క పత్రాలను వెంట ఉంచుకోవాలని అన్నారు. ఫోన్ మాట్లాడుతూ,మద్యం తాగి వాహనాలు నడపొద్దని  వాహనాదారులకు సూచించారు.

More articles

Latest article