రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలి
నిజాంసాగర్, బతుకమ్మ : రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివకుమార్ మాట్లాడారు. రాంగ్ రూట్ లలో వాహనాలు నడపడం గాని, హెల్మెట్లు, సీట్ బెల్టు లేకుండా వాహనాలను నడపవద్దని తెలిపారు. వాహనాల యొక్క పత్రాలను వెంట ఉంచుకోవాలని అన్నారు. ఫోన్ మాట్లాడుతూ,మద్యం తాగి వాహనాలు నడపొద్దని వాహనాదారులకు సూచించారు.