- సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ జాగృతి మహిళా విభాగం
హైదరాబాద్, బతుకమ్మ : పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి “ఎక్స్” అనే సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన @అరవింద్ అన్న ఆర్మీ అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తుండడమే కాకుండా ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకులు వాసగొని శోభ గౌడ్, బండారి లావణ్య, స్వప్న రెడ్డి, సింగిరెడ్డి విమల రెడ్డి, శ్రీలత, మహేశ్వరి, రత్న, పెంటమ్మ, తదితరులు ఉన్నారు.
