నిజామాబాద్, బతుకమ్మ : కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం టపాకాయల దుకాణదారులకు, గోడౌన్ నిర్వాహకులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న దీపావళి సందర్భంగా టపాకాయల, గోడవున్ దుకాణముల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రజలు క్యూలైన్లు పాటించే విధంగా చేయడం, టపాకాయలు నిల్వ ఉంచిన స్థలంలో అమ్మే స్థలంలో చేయకూడని పనులు అమ్మే స్థలంలో చేయవలసిన పనులు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు చేశారు.ఎవరైనా సరే అనుమతి లేకుండా టపాకాయలు దుకాణం నిర్వహించిన, అమ్మిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సి ఐ లు ఎస్సైలు, దుకాణదారులు, గోడౌన్ నిర్వాహకులు, ట్రాన్స్ కో డిపార్ట్మెంటల్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

