రామారెడ్డి, బతుకమ్మ: తాము నిర్మించుకున్న ఇంటి ముందు గేటు పెట్టనీయడం లేదనే మనస్తాపంతో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి కి చెందిన సాయవ్వ అనే మహిళ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తమ ఇంటి ముందు గేటుపెట్టకుండా చెట్కూరి చిన్నమల్లయ్య, చెట్కూరి భాగయ్య, చెట్కూరి కొమురవ్వ, చెట్కూరి మమత, చెట్కూరి రాజమణి అడ్డుకుంటున్నారని సాయవ్వ మనవరాలు పూజిత తెలిపింది. ఈ విషయమై తాము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పిలిచినా వారు రావడం లేదని, తాగి వచ్చి ఇంటి ముందు గొడవ చేయడంతో సాయవ్వ ఆత్మహత్యాయత్నం చేసిందని పూజిత తెలిపింది. అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరింది.
