బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మర్రిపల్లి భూపతికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చరిత్ర విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ప్రొఫెసర్ కె రామకృష్ణ పర్యవేక్షణలో ఎలివేషన్ అండ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ 1956- 2024 స్పెషల్ రిఫరెన్స్ నిజాంబాద్ డిస్టిక్ అనే అంశంపై పరిశోధనలు చేశారు. 22 సంవత్సరాలుగా ఎద్దులు నిర్వహిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసలు అందుకున్నారు. విద్యా విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు మర్రిపల్లి భూపతి. ఎన్ఎస్ఎస్ శిబిరాలు నిర్వహించడం. వెనుకబడిన వర్గాలకు ఉచితంగా మోటివేషనల్ క్లాసులు, సృజనాత్మక విద్యతో విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దడం, పరీక్షల సమయంలో ఉచితంగా యూట్యూబ్ క్లాసు నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి పాటుపడుతూ సామాజిక చైతన్యం, మానసిక వికాసం కోసం విద్యార్థిగా శ్రమిస్తున్నారు. డాక్టర్ ప్రధానం చేయడంతో మిత్రులు శ్రేయోభిలాషులు అధికారులు అనధికారులు అందరు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
