28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

బీబీపేట, బతుకమ్మ : బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. గత పది రోజుల నుండి ఈదురు గాలులతో వడ్లు తడి ఆరబెట్టుకోవడం కోసం ఇబ్బందులు పడి ఇప్పుడు తడి ఆరిన వడ్లను కొనుగోలు చేయమంటే రైస్ మిల్ చైర్మన్ పప్పుల రాజు కొనుగోలు పై ఆంక్షలు విధిస్తూ లారీలను రానివ్వకుండా ఏ ఏ  రైస్ మిల్లులకు వడ్లు లారీలను కేటాయించారు అనే వివరాలు ఇవ్వడం లేదన్నారు. ఆశల పేరుతో తరుగు షాపు చెబుతూ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తున్న వడ్లను సక్రమంగా రవాణా చేయక ఇబ్బందులకు గురి చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  రైస్ మిల్ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు.  గత పది రోజుల క్రితం వడ్ల కల్లాల వద్ద ఐదుగురు పై పిడుగు పడి గాయాలైనట్లు రైతులు తెలిపారు. సొంత ఊరిలో రైతులకు న్యాయం చేయలేని రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ జిల్లా రైతాంగానికి ఏం న్యాయం చేస్తాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మానేయ రాములు, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, హనుమ గౌడ్, యాదయ్య, ఆంజనేయులు, రాజు, పెంటయ్య, గుట్టయ్యా, రమేష్, కిరణ్ కుమార్, శ్రీధర్, బాలమల్లు, వెంకట్ పాల్గొన్నారు.

More articles

Latest article