27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏర్గట్ల ఎస్సై ఆధ్వర్యంలో ఆరైవ్, అలైవ్ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

. . . ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో ఎస్సై పడాల రాజేశ్వర్ తన పోలీస్ సిబ్బంది, అలాగే యముడి వేషధారణతో ఉన్న కళాకారులతో వినూత్న రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో రోడ్డుపై కలియ తిరుగుచు రోడ్డు ప్రమాదాలపై, క్లుప్తంగా బస్టాండ్ వద్ద ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత నియమాలు ప్రతి పౌరుడు, ప్రజలు కచ్చితంగా పాటించాలని కోరారు. మద్యం సేవించి బైకులు, కార్లు, ఇతర వాహనాలు నడపరాదని క్రమశిక్షణ పాటించే విధంగా ఉండాలని అలాగే ప్రతి టూ వీలర్ పై హెల్మెట్ తప్పక ధరించాలని, లేనిచో ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నదని ఎస్సై పడాల రాజేశ్వర్ అన్నారు. ఇట్టి నియమ నిబంధనలు పాటించకపోతే పోలీస్ వారిచే కఠిన చర్యలు తప్పవని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పడాల రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది, యముడి వేషధారణ తో ఉన్న కళాకారులు పాల్గొన్నారు.

More articles

Latest article