28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దొంగని పట్టుకున్న పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

అర తులం బంగారు నగలు దొంగలించిన దొంగని పట్టుకున్నట్టు నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కి చెందిన రమేష్, తాను నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తూ అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 15న రాత్రి తాను ఫ్యామిలీ తో పాటుగా తమ రూమ్ లో పడుకొగా, సుమారు రాత్రి 11 గం.ల సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లో చొరబడి అరతులం బంగారు నగలు (పుస్తె, చెవి ఖమ్మ), రూ.లు 1000/- దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు రిజిస్ట్రేషన్ అనంతరం 2 టీం లను ఏర్పాటు చేసి చుట్టు పక్కన గల సీసీ కెమెరాలను పరిశీలించి దొంగ యొక్క ఆనవాలు కనిపెట్టినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ నెల 17న మధ్యాహ్నం వాహనాల తనిఖీలు చేస్తుండగా, అట్టి అనుమానితున్ని పట్టుకుని విచారించగా, అతను ప్రియదర్శి నగర్ కు చెందిన బానోతు సందీప్ అని తెలిపి, తాను చేసిన నేరమును ఒప్పుకొన్నాడని, తర్వాత అతను దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతనిని రిమాండ్ కి పంపడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండల ప్రజలందరూ కూడా మీ మీ గ్రామాల్లో,  కాలనిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విన్నవించారు.

More articles

Latest article