నూతన డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ నియామకం

0 9,674

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)లు బాధ్యతలు స్వీకరించారు. బాల్కొండ మండలంలో విధులు నిర్వహిస్తున్న రమేష్ పదోన్నతి పొందుతూ ఏర్గట్ల మండలానికి డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. అలాగే ముప్కాల్ మండలం నుండి రవి డిప్యుటేషన్‌పై ఏర్గట్ల మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా బదిలీ అయ్యి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ జె. మల్లయ్య మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు మండలంలో రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

 

Appointment of new Deputy Tahsildar and RI

Leave A Reply

Your email address will not be published.