28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు..

Must read

📰 Generate e-Paper Clip

 

. . .కేసీఆర్ తో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగం

 

ఎర్రవల్లి, బతుకమ్మ:

 

నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు,రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు,తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి,బీఆర్ఎస్ అధినేత, మాజీ సీయం కేసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఎర్రవల్లిలోని మాజీ సీయం కేసిఆర్ ఫాం హౌస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాగా ఆయనకు వర్కింగ్ ప్రేసిడేంట్ కే. తారక రామారావు పుష్ఫగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. ఈ సంధర్బంగా కేసీఆర్ ని కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని,మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు అన్నా.. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నా..అంటూ తన మనసు మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.కాగా జీవన్ రెడ్డి ని అనునయిస్తూ, వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు కేసీఆర్ .జీవన్ రెడ్డిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని,దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని కుడా పార్టీలోకి అహ్వనించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్,ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ ఎల్. రమణ,ఎమ్మెల్యే డా. కె. సంజయ్,మాజీ ఎంపీ  సంతోష్ కుమార్,మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు,పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జీవన్ రెడ్డి తో పాటు వచ్చిన వారిలో వారి కుమారులు,జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులు ఉన్నారు.

 

Anna.. God sent me to work with you..
Anna.. God sent me to work with you..

More articles

Latest article