29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ రాష్ట్రంలో బారీగా జిల్లాజడ్జిలను బదిలీలు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కొత్తగూడెం ప్రిన్స్ పల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా జి. ప్రేమలత

 

. . . నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ బదిలీ

 

. . .రాష్ట్రంలో 35 మంది జడ్జీల బదిలీ

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

తెలంగాణ రాష్ట్రంలో పలువురు జిల్లాజడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 35 మంది జడ్జీల బదిలీ చేస్తు అదేశాలు జారీ అయ్యాయి. న్యాయమూర్తుల స్థాన చలనం లో బాగంగా ఆదిలాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జి డాక్టర్ పి. శివ రామ్ ప్రసాద్ ను సూర్యాపేట అదనపు జిల్లాజడ్జిగా, కరీంనగర్ రెండవ అదనపు జిల్లాజడ్జి డి. సాధన ను రంగారెడ్డి జిల్లా ఎల్. బి నగర్ మూడవ అదనపు జిల్లాజడ్జిగా, జగిత్యాల మొదటి అదనపు జిల్లాజడ్జి సుగాలి నారాయణ ను నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి గా,పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని అదనపు జిల్లాజడ్జి డాక్టర్ తట్ట శ్రీనివాస్ రావు ను హన్మకొండ ఇండస్ట్రీయల్ ట్రిబ్యునల్,లేబర్ కోర్టు కు, ఖమ్మం మొదటి అదనపు జిల్లాజడ్జి కే. ఉమాదేవి ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయి గూడ ప్యామిలి కోర్టుకు, ఖమ్మం రెండవ అదనపు జిల్లాజడ్జి వెంపటి అపర్ణ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 26 వ అదనపు చీఫ్ జడ్జిగా, ఖమ్మం మూడవ అదనపు జిల్లాజడ్జి దేవినేని రామ్ ప్రసాద రావు ను రంగారెడ్డి జిల్లా కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు, ఖమ్మం నాల్గవ అదనపు జిల్లాజడ్జి ఎమ్. అర్చన కుమారి హైదరాబాద్ పోక్సో కోర్టుకు, కొత్తగూడెం ప్రిన్స్ పల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పి. వసంత్ ను నల్గొండ కు, మహబూబ్ నగర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి రాచపూడి శ్రీదేవి ని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుషాయి గూడ ఫ్యామిలీ కోర్టుకు, వనపర్తి ప్రిన్స్ పల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మంత్రి రామకృష్ణ సునీత ను హన్మకొండ కు, సంగారెడ్డి రెండవ అదనపు జిల్లాజడ్జి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణ అర్జున్ ను ఖమ్మం మూడవ అదనపు జిల్లాజాడ్జిగా, సంగారెడ్డి మూడవ అదనపు జిల్లాజడ్జి జి. సునీత రవీంద్ర రెడ్డి ని జగిత్యాల మొదటి అదనపు జిల్లాజడ్జిగా,సంగారెడ్డి ప్యామిలి కోర్టు జడ్జి కోట్ల లావణ్య బాల్ రెడ్డి ని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని అదనపు జిల్లాజడ్జి (చైర్మన్ ఇండస్ట్రీయల్ ట్రి బ్యునల్ ) గా, నల్గొండ ప్రిన్స్ పల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎమ్. నాగరాజు ను వికారాబాద్ కు,నల్గొండ మొదటి అదనపు జిల్లాజడ్జి జి. సంపూర్ణ ఆనంద్ ను రంగారెడ్డి జిల్లా ఎల్. బి నగర్ అదనపు జిల్లాజడ్జిగా,నిజామాబాద్ రెండవ అదనపు జిల్లాజడ్జి టి. శ్రీనివాస్ ను రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోక్సో కోర్టుకు,రంగారెడ్డి జిల్లా ఎల్. బి నగర్ ఐదవ మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి టి. డి మాధవి కృష్ణ ను సంగారెడ్డి మూడవ అదనపు జిల్లాజడ్జిగా,రంగారెడ్డి జిల్లా ఎల్. బి నగర్ ఎనిమిదవ అదనపు జిల్లాజడ్జి ఎమ్ సతీష్ కుమార్ ను సంగారెడ్డి నాల్గవ అదనపు జిల్లాజడ్జి గా,రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోక్సో కోర్టు జడ్జి పి. ఆంజనేయులు ను మహబూబ్ నగర్ ప్యామిలి కోర్టుకు, రంగారెడ్డి జిల్లా కూకట్ పల్లి ఆరవ అదనపు జిల్లాజడ్జి సి. పావని కరీంనగర్ రెండవ అదనపు జిల్లాజడ్జిగా,రంగారెడ్డి జిల్లా ఎల్. బి నగర్ వాణిజ్య వివాదాల పరిష్కార కోర్టు స్పెషల్ జడ్జి ఎన్. సంతోష్ కుమార్ ను ఏసీబి కోర్టు కమ్ ఆరవ అదనపు జిల్లాజడ్జిగా,రంగారెడ్డి జిల్లా ఎల్. బి నగర్ పదకొండవ అదనపు జిల్లాజడ్జి పి. ప్రదీప్ నాయక్ ను వికారాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జిగా వికారాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జి సి.హెచ్ చంద్ర కిషోర్ సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు మొదటి అదనపు చీఫ్ జడ్జిగా,హన్మకొండ మొదటి అదనపు జిల్లాజడ్జి బి. అపర్ణ దేవి ని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పదవ అదనపు జిల్లాజడ్జిగా, వరంగల్ మొదటి అదనపు జిల్లాజడ్జి జి. ప్రేమలత ను కొత్తగూడెం ప్రిన్స్ పల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా,వరంగల్ రెండవ అదనపు జిల్లాజడ్జి మనిషా శ్రావణ్ ఉన్నాం ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇరవై నాల్గవ అదనపు చీఫ్ జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మూడవ అదనపు చీఫ్ జడ్జి బాకరాజు శ్రీనివాస రావు ను ఖమ్మం మొదటి అదనపు జిల్లాజడ్జిగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మొదటి అదనపు సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ ను రంగారెడ్డి జిల్లా ఎల్.బి నగర్ మొదటి అదనపు జిల్లాజడ్జిగా,హైదరాబాద్ పన్నెండవ అదనపు జిల్లాజడ్జి టి.అనిత ను రంగారెడ్డి జిల్లా ఎల్.బి నగర్ పన్నెండవ అదనపు జిల్లాజడ్జిగా,హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తొమ్మిదవ అదనపు జిల్లాజడ్జి డాక్టర్ జి. వి. మహేష్ నాథ్ ను ఖమ్మం ప్యామిలి కోర్టుకు,హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పద్నాల్గవ అదనపు చీఫ్ జడ్జి ఎమ్. పద్మజ ను వరంగల్ రెండవ అదనపు జిల్లాజడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పదహారవ అదనపు చీఫ్ జడ్జి ఎమ్. కిరణ్ మహి ని నల్గొండ నాల్గవ అదనపు జిల్లాజడ్జిగా,హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇరవై రెండవ అదనపు చీఫ్ జడ్జి జె. మైత్యేయి ని వరంగల్ మొదటి అదనపు జిల్లాజడ్జిగా బదిలీలు చేశారు. నల్గొండ నాల్గవ అదనపు జిల్లాజడ్జి కే. కవిత ను నల్గొండ మొదటి అదనపు జిల్లాజడ్జి గా నియమిస్తు సర్దుబాటు చేశారు.

 

High Court orders transferring district judges in Telangana state

More articles

Latest article