- హాజరు పట్టికలో ఉన్న విద్యార్థులకు.. రోజు వచ్చే విద్యార్థులకు పొంతనే లేదు
బతుకమ్మ: బిచ్కుంద. బిచ్కుంద మండల కేంద్రంలోని 13వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రం పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఆ కేంద్రంలో టీచర్, ఆయా ఇష్టారీతిన విధులు నిర్వర్తిస్తున్నారు. అంగన్వాడి కేంద్రానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కోరువడడంతో అంగన్వాడీ టీచర్ మరియు ఆయా ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు.
- సిబ్బంది ఇష్టారాజ్యం..
బిచ్కుంద మండల కేంద్రంలోని 13 వ వార్డులో గల అంగన్వాడీనిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. టీచర్,ఆయా సమయపాలన పాటించడం లేదు. ఇష్టారీతిన కేంద్రాలు తెరుస్తున్నారు. సమయానికి ముందే మూసివేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం లో పిల్లలు లేకున్నా.. ఉన్నట్లు రిజిస్టర్ లో నమోదు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఐదు నుంచి 6 మంది పిల్లలే వస్తున్నప్పటికిని రికార్డులో 18 వరకు ఉన్నట్లు రాస్తున్నారు. వారి పేరు మీద వచ్చిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. అంటూ పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
- అధికారుల పట్టింపేది..!
బిచ్కుంద మండల కేంద్రంలోని 13వ వార్డులో గల అంగన్వాడి సెంటర్ పై సీడీపీవో పర్యవేక్షణ ఉండాలి. కానీ సిడిపిఓ పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టరీతిన మారిందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అంగన్వాడి సెంటర్లలో ప్రభుత్వం ఓవైపు చిన్నారులకు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచిస్తోంది. వివిధ పథకాలు అమలు చేస్తూ లబ్ధిదారుల సంఖ్య పెంచాలని ఆదేశిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, విధులు సక్రమంగా నిర్వహించనివారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంగన్వాడి కేంద్రంలో 18 మంది చిన్నారులు ఉండగా రోజుకు కనీసం ఐదారు మంది విద్యార్థులు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఉదయం 9 గంటలకు తెరవాల్సిన అంగన్వాడి కేంద్రం 10:30 గంటలు అయినా తెలుసుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. వీటిని పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. క్షేత్రస్థాయిలో వీటి పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది కనీసం బాలింతలు, గర్భిణులకు పోషకాహారం కూడా అందించడం లేదు. ఏవేవో కారణాలతో అంగన్వాడి కార్యకర్త విధులకు హాజరు కావడం లేదు. ఈ విషయమై పత్రికా విలేకరి అంగన్వాడి సెంటర్ ను పరిశీలించగా కేవలం ఐదు ఆరుగురు చిన్నారులు మాత్రమే కనిపించడం గమనార్హం. కాగా హాజరు పట్టికలో మాత్రం 18 మంది విద్యార్థులు నమోదయి ఉండడం ఆలోచించదగ్గ విషయమే అంగన్వాడి కేంద్రానికి భోజనం చేసేందుకు బాలింతలు గృహిణులు. భోజనానికి రాకున్నప్పటికిని హాజరు పట్టికలో మాత్రం వస్తున్నట్టు నమోదు కాబడి ఉండడం గమనార్హం ఇప్పటికైనా ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రంపై దృష్టి పెట్టాలని విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
