24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాచూర్ లో వైద్య శిబిరం ఏర్పాటు : ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  తక్షణమే స్పందించి రాచూర్ గ్రామానికి వెళ్లారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే  గ్రామంలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని, వెంటనే వైద్య అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు.  వైద్యుల బృందాన్ని గ్రామానికి పిలిపించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్యుల బృందం… అనారోగ్యానికి గురైన వారికి పరీక్షలు చేసి, వైద్యం అందించి, మందులు అందజేశారు. వైద్యుల సూచన మేరకు కొంతమంది పేషంట్స్ ను మద్నూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు పంపిస్తున్నారు. ఎమ్మెల్యే తో పాటు నాయకులు ఉన్నారు.

Medical camp to be organized in Rachur: MLA

More articles

Latest article