వెబ్ డెస్క్, బతుకమ్మ :
మహారాష్ట్ర రాష్ట్రంలోని అహల్యనగర్‌కు చెందిన బాలిక అనంతి మార సోలాపూర్‌లో నిర్వహించిన కల్పతరు నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్-2026లో తన ప్రతిభను చాటుకుంది. ఆదివారం (మే 31) జరిగిన ఈ జాతీయ స్థాయి నృత్య పోటీల్లో పాల్గొన్న అనంతి అద్భుతమైన నృత్య ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని “ప్రతిభా పురస్కారం” అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా అనంతి సాధించిన విజయంపై ఆమె తల్లిదండ్రులు మార దత్తాత్రేయ, మార జ్యోతి, అలాగే తమ్ముడు మార విక్రాంత్ హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె సాధించిన ఈ ఘనత కుటుంబానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. అనంతి భవిష్యత్తులో కూడా నాట్య ప్రదర్శనలలో మరింత ఉత్సాహంగా పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మరిన్ని పురస్కారాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు. ఆమె ప్రతిభకు ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

