కల్పతరు నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్‌లో ప్రతిభ చాటిన అనంతి మార
వెబ్ డెస్క్, బతుకమ్మ : మహారాష్ట్ర రాష్ట్రంలోని అహల్యనగర్‌కు చెందిన బాలిక అనంతి మార సోలాపూర్‌లో నిర్వహించిన కల్పతరు నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్-2026లో తన ప్రతిభను చాటుకుంది. ఆదివారం (మే 31) జరిగిన ఈ జాతీయ స్థాయి నృత్య పోటీల్లో పాల్గొన్న అనంతి అద్భుతమైన నృత్య ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని "ప్రతిభా పురస్కారం" అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా అనంతి సాధించిన విజయంపై ఆమె తల్లిదండ్రులు మార దత్తాత్రేయ, మార జ్యోతి, అలాగే తమ్ముడు మార విక్రాంత్ హర్షం వ్యక్తం చేశారు....