30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు అల్పాహారం, భోజన సదుపాయం

 

. . . ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి.నిజాం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి.నిజాం తెలిపారు. అడ్మిషన్లను పెంచేందుకు కళాశాల అధ్యాపకులు తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాలకు వచ్చిన పలువురు విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి. నిజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అత్యుత్తమమైన, నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఆధునిక బోధన విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం కూడా అందించే కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం కళాశాల అధ్యాపకులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలు, అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యాభ్యాసంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

 

Admissions begin at Yella Reddy Government Junior College

More articles

Latest article