త్రైమాసిక ఫలితాలు ప్రకటన
ఒక్కో షేరుకు రూ. 15 డివిడెండ్
వెబ్ న్యూస్, బతుకమ్మ : స్టేట్ బ్యాంక్ ఇండియా తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.18,642.59 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభంలో 10 శాతం క్షీణించింది. సమీక్ష త్రైమాసికంలో బ్యాంక్ రూ. 1,43,876 కోట్ల ఆదాయన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాది ఈమొత్తం రూ. 1,28,412 కోట్లుగా ఉన్నట్లు ఎస్బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. త్రైమాసిక ఫలితాల సందర్భంగా బ్యాంకు ఒక్కో షేరుకు రూ. 15.90 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
