ఇందల్ వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని సోమవారం ఘనంగా ఊర పండగ నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవార్ల ఊరేగింపులు కొనసాగిస్తూ దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టపలను స్థాపించారు.అనంతరం డప్పు వాయిద్యాలతో పోతురాజుల విన్యాసాలతో పండగలు ఘనంగా నిర్వహించారు. సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ పండగలు గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ఆయురారోగ్యంతో సుఖసంతోషాలతో పాడిపంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ఊర పండుగ సందర్భంగా గ్రామంలోని గ్రామదేవతలకు గావులు పట్టి బలి ఇచ్చారు.అనంతరం వనభోజనాలకు గ్రామస్తులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీపతి జితేందర్,వైస్ చైర్మన్ ఇట్టేడి బాల్ రెడ్డి,బైరి లింగం,జోగు జనార్దన్, ,మారంపల్లి రమేష్ ,నవీన్ గౌడ్ ,మంగలి పోశెట్టి ,నిజముద్దీన్,పాశం శ్రీనివాస్
,సంగేమ్ పెద్ద సాయిలు తలారి శంకర్ లు పాల్గొన్నారు.
ఇందల్వాయి లో ఘనంగా ఊర పండగ
