ఇందల్వాయి లో ఘనంగా ఊర పండగ
ఇందల్ వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని సోమవారం ఘనంగా ఊర పండగ నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవార్ల ఊరేగింపులు కొనసాగిస్తూ దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టపలను స్థాపించారు.అనంతరం డప్పు వాయిద్యాలతో పోతురాజుల విన్యాసాలతో పండగలు ఘనంగా నిర్వహించారు. సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ పండగలు గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ఆయురారోగ్యంతో సుఖసంతోషాలతో పాడిపంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ఊర పండుగ సందర్భంగా గ్రామంలోని గ్రామదేవతలకు గావులు పట్టి బలి ఇచ్చారు.అనంతరం వనభోజనాలకు గ్రామస్తులు...