27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఏఐయుకెఎస్ జాతీయ నేతగా వి.ప్రభాకర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ (ఏఐయుకెఎస్) జాతీయ సభ్యునిగా వి. ప్రభాకర్ ఎన్నికయ్యారు. గ్రామ స్థాయి లో గుత్పల సంఘం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ప్రభాకర్ రైతంగా సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా క్రీయాశీలక నేత గుర్తింపు ఉంది.ఆయన ఎర్రజొన్నల విషయంలో, దాన్యం గిట్టుబాటు ధర కోసం, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూముల పరిరక్షణ కోసం,పేదల పోడు భూముల పట్టాల కోసం ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి . అయన చేసిన కృషి ఫలితంగా దేశంలో ఉన్న అన్ని రైతుకులీ సంఘాలు విలీనమై నూతంగా ఏర్పడ్డ ఏఐయుకెఎస్ సంఘం గుర్తించింది. ఇందులో భాగంగా రైతంగా సమస్యల పరిష్కారం, ఏఐయుకెఎస్ సంఘ పటిష్టతకు ఆయన సేవలు అవసరమని భావించి ఆయన్ని జాతీయ సభ్యునిగా ఎన్నుకొన్నారు. ఈ నెల 19,20 తేదీల్లో దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో పశ్చిమ బెంగాల్ లోని భంగార్ లో ఏర్పాటు చేసిన సభలోప్రభాకర్ ను ఎన్నుకొన్నారు. 1977 నుండి రైతు కూలీ ల సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన ఆయనకు మంచి స్థానం లభించడం విశేషం. కాగా ఆయన ఎన్నిక జిల్లాలోని వివిధ విప్లవ,రైతు కూలీ సంఘాలకు,నాయకులు, సభ్యులకు మంచి ఉత్సాహంను ఊపునిచ్చింది.

More articles

Latest article