24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అగ్మాంట్ గోల్డ్ లోన్ విజేత నారా నాగేష్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలోని అగ్మాంట్ గోల్డ్ లోన్ ముంబై సంస్థ వారు గురువారం నిర్వహించిన లక్కీ డ్రాలో వేల్పూర్ మండలం మోతె నారా నాగేష్ విజేతగా నిలిచారు. ఈ సందర్బంగా అగ్మాంట్ సంస్థ వరంగల్ జిల్లా రీజినల్ బ్రాంచ్ మేనేజర్ శామ్యూల్, భీమ్ గల్ బ్రాంచ్ మేనేజర్ గంగ మోహన్, సహ ఉద్యోగులు,కలిసి గోల్డ్ లోన్ పై బహుమతి గెలుపొందిన వ్యక్తికి సాంసంగ్ కంపెనికి చెందిన రూ.28 వేల విలువ గల 42 ఇంచుల ఎల్ఈడి టీవీ ని  బహుమతిగా అందజేశారు.ఈ సందర్భంగా గోల్డ్ లోన్ తీసుకొని బహుమతి పొందిన విజేత మాట్లాడుతూ తెలంగాణ మొత్తంలో ప్రవేట్ లిమిటెడ్ బ్యాంకులు, లొన్ సంస్థలు ఎన్నో ఉన్న, అగ్మాంట్ సంస్థ మాత్రమే ఇంట్రెస్ట్ తక్కువగా తీసుకుని,కస్టమర్లకు బహుమతులు ఇస్తున్నారని అన్నారు. ఈ బహుమతిని మాకు అందించిన బ్రాంచ్ మేనేజర్, స్టాప్ కు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో  కాశీనాథ్, సాయి కుమార్, విగ్నేష్, దుర్గా దుర్గా ప్రసాద్,రజిత ఉన్నారు.

More articles

Latest article