25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ప్రజా యుద్ధనౌక గద్దర్ పై ఎంపి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మోర్తాడ్ మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రౌడీలను, గూండాలను పార్లమెంట్ కు, అసెంబ్లీ కి పంపిస్తే ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉంటాయని దళిత సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బహుజనులు నిద్ర లేవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లూరి రాజారాం, ఉపాధ్యక్షులు జాంబవ చామర్, ప్రధాన కార్యదర్శి మామిడి గంగాధర్,ధర్మ సమాజ్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షులు ఉమేష్ మహారాజ్, అంబేద్కర్ యువజన సంఘం మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళీ మాలజీ, పులి శేఖర్ బండి సాగర్, బోడ గణేష్ మామిడి రాజేందర్ కుందన రాజు  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article