27.8 C
Hyderabad

నలుగురు డీజే ఆపరేటర్ల ముందస్తు బైండోవర్

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని నలుగురు డీజే ఆపరేటర్లను ముందస్తుగా బైండోవర్ చేసినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. డిజే ఆపరేటర్లు ఎం.డి జావీద్-అక్బర్ నగర్, బంటు ఫణి రాజ్-రుద్రూర్, ఉప్పు సాగర్-సులేమాన్ నగర్, ఇందూర్ విజయ్ -అంబం గ్రామాలకు చెందిన వీరిని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయి ఎదుట మంగళవారం  బైండొవర్ చేసినట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు.  ఒకవేళ షరతులు ఉల్లంగించినచో ఒక్కొక్కరికి 1,50,000 రూపాయల జరిమానా వేయనున్నట్లు తహసీల్దార్ తారాబాయి తెలిపారు.

More articles

Latest article