నలుగురు డీజే ఆపరేటర్ల ముందస్తు బైండోవర్
రుద్రూర్, బతుకమ్మ : గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని నలుగురు డీజే ఆపరేటర్లను ముందస్తుగా బైండోవర్ చేసినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. డిజే ఆపరేటర్లు ఎం.డి జావీద్-అక్బర్ నగర్, బంటు ఫణి రాజ్-రుద్రూర్, ఉప్పు సాగర్-సులేమాన్ నగర్, ఇందూర్ విజయ్ -అంబం గ్రామాలకు చెందిన వీరిని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయి ఎదుట మంగళవారం బైండొవర్ చేసినట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఒకవేళ షరతులు ఉల్లంగించినచో ఒక్కొక్కరికి 1,50,000 రూపాయల జరిమానా వేయనున్నట్లు తహసీల్దార్ తారాబాయి తెలిపారు.