22.7 C
Hyderabad

అనుమతులు లేని పాఠశాలపై చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి రాజు

 

బతుకమ్మ బాన్సువాడ : ప్రైవేట్ పాఠశాలలు అనుమతుల్లేకుండా నడిపిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని డీఈవో రాజు హెచ్చరించారు. గురువారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అన్నారు.పాఠశాలలో నోటు బుక్స్, యూనిఫాంలు, బ్యాగులు, స్టేషనరీలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అమ్మకాలు చేస్తే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంఈవో నాగేశ్వర్ రావు, డీఎల్​పీవో సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article