26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్

 

బతుకమ్మ, బాన్సువాడ : మున్నూరుకాపుల అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజ్  పేర్కొన్నారు. గురువారం బీర్కూర్ మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాన్సువాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో కాసుల బాలరాజ్​ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.మున్నూరుకాపులు  ఐక్యంగా ఉండాలని ప్రతి గ్రామంలో మున్నూరు కాపు కళ్యాణ మండపాల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రాజకీయపరంగా వెనుకబడ్డారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ ప్రకాష్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ యామ రాములు, మున్నూరు కాపు మండలాధ్యక్షుడు మేకల విఠల్, ఆయా గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article