- ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించబోయే ఒలంపిక్ రన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి తెలిపారు. ఈ ఒలంపిక్ రన్ రాజ రాజేంద్ర చౌరస్తా నుండి ప్రారంభమై గాంధీచౌక్, బస్టాండ్ మీదుగా కలెక్టర్ గ్రౌండ్ కు చేరుకుంటుందని తెలిపారు. నగరంలోని రాజకీయ ప్రముఖులు, వివిధ క్రీడ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ పాఠశాల విద్యార్థులు,వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, ఒలంపిక్ రన్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ రన్ లో జిల్లా, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొని ఒలింపిక్ రన్ ను విజయవంతం చేయాలని కోరారు. రన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రాజకీయ ప్రముఖులు క్రీడా ప్రముఖులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో లో చైర్మన్ లింగయ్య,కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, భూమా రెడ్డి, గాదరి సంజీవరెడ్డి, స్వామి కుమార్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
