తనిఖీలతో హడలెత్తిస్తున్న ఏసీబీ

0 78,987
  • 24 గంటల్లో మూడు ప్రాంతాల్లో సోదాలు
  • అవినీతి, అక్రమాల వివరాలు సేకరణ

 

నిజామాబాద్, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ తనిఖీలు, సోదాలతో హడలెత్తిస్తుంది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కలకలం రేపింది. బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేపట్టింది. మధ్యాహ్నం బల్ధియా టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు జరిగాయి. టౌన్ ప్లానింగ్ లో ఏసీబీ అధికారుల తనిఖీతో కార్పొరేషన్ కార్యాలయం అంతటా నిశబ్ధ వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 8న రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసచారి రూ.8 వేల లంచం తీసుకుంటూ దొరికిన ఘటన మరువకముందే ఏకంగా టౌన్ ప్లానింగ్ పై ఏసీబీ దాడులు చేయడం కలకలం రేపింది. టౌన్ ప్లానింగ్ లో అవినీతి అధికారులు పట్టుబడ్డారని ప్రచారం జరిగినా కేవలం రికార్డుల పరిశీలన వివరాల సేకరణ మాత్రమే జరిగిందని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వివరణ ఇచ్చారు.

ACB is stirring up trouble with inspections

  • టౌన్ ప్లానింగ్ లోనే ఏసీబీ తనిఖీలు ఎందుకంటే..?

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ గుండెకాయ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు నుడా పరిధిలో జరుగుతున్న పనులను డీటీసీపీ అనుమతుల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. 1973 నాటి మాస్టార్ ప్లాన్ స్థానంలో గత ప్రభుత్వం కొత్త మాస్టార్ ప్లాన్ తెచ్చినా దాని ముసాయిదా జాబితా ఇంకా ప్రభుత్వం వద్దనే పెండింగ్ లో ఉంది. కొత్త మాస్టార్ ప్లాన్ కు ప్రభుత్వ ఆమోదం లభించకపోవడంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు, నాన్ లేఅవుట్ వెంచర్లు యథేచ్చగా జరుగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లు మూసుకోవడంతో సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు, సెల్లార్ లేకుండా అపార్ట్ మెంట్ లు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ అనుంధంగా ఉండాల్సిన విజిలెన్స్ (మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, పోలీసు శాఖ) టీంలు పని చేయక కొన్ని రోజులవుతుంది. దానితో నిజామాబాద్ నగరం అక్రమ నిర్మాణాలతో కుచించుకపోతుంది. కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏళ్ళ తరబడి తిష్టవేసి అక్రమ సంపాదనకు అడ్డాగా చేసుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే టౌన్ ప్లానింగ్ పై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. 2024లో ఏసీబీ జిల్లా చరిత్రలోనే ఆదాయానికి మించిన (లెక్కకు మించిన) డబ్బులు కలిగిన కేసులో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నరేందర్ పట్టుబడిన విషయం తెల్సిందే. ఆయన ఇప్పటి వరకు విధుల్లో చేరనీయలేదు.

  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 24 గంటల్లో ఏసీబీ మూడు చోట్ల సోదాలు..

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ల్యాండ్ సర్వే డిపార్ట్ మెంట్ కు చెందిన సర్వేయర్ కిరణ్ మంగళవారం సికింద్రాబాద్ లో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళపై నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలోని విద్యాశాఖ అధికారి ఆఫీస్ లో ఏసీబీ అధికారులు వివరాల సేకరణ చేయడం కలకలం రేపింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన పీఎంశ్రీ పథకం సంబంధించిన వివరాల గురించి ఆరా తీయడం కలకలం రేపింది.

ACB is stirring up trouble with inspections

Leave A Reply

Your email address will not be published.