29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క నిలదీసిన రైతులు

Must read

📰 Generate e-Paper Clip

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి… తక్షణం ధాన్యం బోనస్ చెల్లించాలి

. . . రామారెడ్డి లో మంత్రి సీతక్క పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత

 కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కను రైతులు, బిఆర్ఎస్ నాయకులు నిలదీశారు.  తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి… తక్షణం ధాన్యం బోనస్ చెల్లించాలని సీతక్కను గురువారం రామారెడ్డి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ నాయకులు,రైతులు  అడ్డుకున్నారు. ఈ సందర్భంగా  మంత్రి సీతక్క,  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో స్థానిక నేతల వాగ్వివాదానికి దిగారు. పోలీస్ అధికారుల వైఫల్యం మంత్రి సీతక్క పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చివరకు రైతులను, నాయకులను సముదాయించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల వానాకాలం అత్యధిక వర్షం కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పరిహారం రాకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అనాడు వరద బాధితులను పరామర్శించిన మంత్రి సీతక్క రైతులకు పరిహారం ఇస్తామని, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తరువాత తొలిసారి జిల్లా కు రావడంతో బిఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి అడ్డుకున్నారు.

 

Farmers protest against District In-charge Minister Seethakka

More articles

Latest article