తనిఖీలతో హడలెత్తిస్తున్న ఏసీబీ

24 గంటల్లో మూడు ప్రాంతాల్లో సోదాలు అవినీతి, అక్రమాల వివరాలు సేకరణ   నిజామాబాద్, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ తనిఖీలు, సోదాలతో హడలెత్తిస్తుంది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కలకలం రేపింది. బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేపట్టింది. మధ్యాహ్నం బల్ధియా టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు జరిగాయి. టౌన్ ప్లానింగ్ లో ఏసీబీ అధికారుల తనిఖీతో కార్పొరేషన్ కార్యాలయం అంతటా నిశబ్ధ వాతావరణం నెలకొంది....