పీఎంశ్రీ పథకంపై ఏసీబీ నజర్

0 75,497
  • పెద్ద ఎత్తున ఫిర్యాదులు
  • వివరాలను సేకరిస్తున్న అవినీతి నిరోదక శాఖ

 

నిజామాబాద్, బతుకమ్మ : దేశ వ్యాప్తంగా పాఠశాలలు అభివ`ద్ది చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ పథకానికి శ్రీకారం చుట్టింది. పీఎంశ్రీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా నిధులు కేటాయించి పాఠశాలల డెవలప్ మెంట్ ను చేయాలనే లక్ష్యంతో 2027 సెప్టెంబర్ 7న పీఎంశ్రీ పథకాన్ని ప్రారంభించింది. దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివ`ద్ది కోసం 27360 కోట్లను ఖర్చు చేయాలని సకల్పంచంది. 2023-24 విద్యా సంవత్సరంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 268.58 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.179.4 కోట్లు మొత్తంగా  447.63 కోట్లు కేటాయించింది. అందులో ఇప్పటి వరకు రూపాయలు 123.31`కోట్లు వినియోగించనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో 23, నిజామాబాద్ 27 పాఠశాలలు పీఎం శ్రీ పథకానికి ఎంపికయ్యాయి.

దేశ వ్యాప్తంగా , రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పీఎంశ్రీ స్కూళ్ళ అభివ`ద్ది పథకానికి అవినీతి చెదలు పట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఈ పథకం కింద వచ్చిన నిధుల ఖర్చుకు జరుగుతున్న పనులకు పొంతన లేదని విమర్శలు వచ్చాయి. స్థానికుల నుంచి మొదలుకుని స్కూల్ మేనేజ్ మెంట్ సభ్యులు కూడా నిధుల వినియోగంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ పథకం ప్రారంభించిన పాఠశాలల్లో టీ స్నాక్స్, సీడ్స్, వాటర్ బిల్లులు వేలల్లో చూపించడం, శిక్షణ సమావేశాల ఖర్చకు పేరిట కొత్త బిల్లులు తయారు చేశారని , శిక్షణ కార్యక్రమాలు జరుగకపోయినా, ఎక్స్ పెండిచర్ రికార్డులు తయారు చేశారన్న వాదనలున్నాయి. హెడ్ మాస్టార్లు, ఇంచార్జి హెచ్ ఎంల డీజిల్ బిల్లులు, ట్రావెలింగ్ బస్సులే ఎక్కువగా చూపించారన్న వాదనలు లేకపోలేదు. పేపర్ పైన పనులు జరిగినట్లు ఉండగా గ్రౌండ్ లేకున్నా డిజిటల్ క్లాస్ రూంలు, సానటేషన్ వ్యవస్థ, కొత్త ఫర్నిచర్ కొనుగోలు, మరమ్మత్తులు, పెయింటింగ్, ప్రా.జెక్టు పరికరాలు కొనుగోలు చేయకున్నా చేసినట్లు రికార్డులు  చెబుతున్నాయి.

పీఎంశ్రీ పథకాన్ని క్షేత్రస్తాయిలో పర్యటించి నిధులు విడుదల చేయాల్సి ఉంది. మండల విద్యాధికారులు జిల్లా విద్యాశాఖాధికారే. పీఎంసీ పథకంలో యూసీలు, టెక్నికల్ వాల్యుయేషన్, ఇన్స్ పెక్టన్ రిపోర్టులు, వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే నిధులు విడుదల చేయాలి. వాటిని అధికారుల ద్వారా జరుగుతుంటే ఎలా నిధులు పక్కదారి పడుతాయని అందులో అందరికీ ప్రమేయం ఉందనే వాదనలున్నాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) నిర్వాహణపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చాలా చోట్ల ల్యాబ్ రూంలు ఉండగా వాటిని పక్కన పెట్టడం, పరికరాలు వాడకపోవడం, కొనుగోలు చేయకున్నా చేసినట్లు బిల్లులు మాత్రమే ఉన్న సందర్భాలున్నాయి. చాలా చోట్ల ఈ పథకం కింద జరుగుతున్న అవకతవకలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం  చేస్తాయని  నిపుణులు చెబుతున్నారు. పీఎంశ్రీ పథకం అమలుపై జిల్లా స్థాయిలో పూర్తి ఆడిట్, క్షేత్రస్థాయిలో తనిఖీలు, స్కూల్ స్టాంప్ లను స్వాధీనం చేసుకోవడం, ఫేక్ బిల్లులు, ట్రావెలింగ్ ఖర్చులపై విచారణ కమిటీ వేయాలని, పబ్లిక్ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి నిధుల పంపిణీ, వినియోగంపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పీఎం శ్రీ పథకం అమలవుతున్న తీరు గురించి ఆరా తీసినట్లు తెలిసింది. మంగళవారం నిజామాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో సంబంధిత పథకం  గురించి నిధులు, నిర్వాహణ, వినియోగంపై వివరాలు సేకరించడం అందుకేనని చర్చ జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.