కామారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం) మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ నివాసాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి – శ్రీనివాస్ దంపతులు శాలువాతో ఘన స్వాగతం పలికి ఆత్మీయ ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ వారి ఆహ్వానాన్ని మన్నించి స్వగృహానికి విచ్చేసినందుకు చైర్‌పర్సన్ దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా సమయం కేటాయించి అతిథ్యాన్ని స్వీకరించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి – శ్రీనివాస్ దంపతులు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో యువ నాయకుడు ఇలియాజ్, సీనియర్ నాయకులు పున్న రాజేశ్వర్, నీల నాగరాజు, ఇటుకల శ్రీనివాస్‌తో పాటు ప్రేమ్ నాయక్, అక్షయ్, గంగాధర్, నాగార్జున, ప్రశాంత్, నితిన్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

