కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి ఘన స్వాగతం

కామారెడ్డి, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం) మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ నివాసాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి - శ్రీనివాస్ దంపతులు శాలువాతో ఘన స్వాగతం పలికి ఆత్మీయ ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ వారి ఆహ్వానాన్ని మన్నించి స్వగృహానికి విచ్చేసినందుకు చైర్‌పర్సన్ దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు....