సమగ్ర విచారణ జరపాలి

0 8,978

 

. . . బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పై ఒక మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణల పై సమగ్ర విచారణ జరపాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా కార్యాలయంలో బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తల్లారే సంజయ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లత మాట్లాడుతూ  హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఒక 17 ఏళ్ల బాలిక కుటుంబం ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకోవడానికి తాత్సారం చేయడంతో పాటు కేసు తీవ్రతను నీరుగార్చే ప్రయత్నం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు మీడియా సాధనాల్లో వస్తున్న వార్త కథనాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ మహిళా పోలీస్ అధికారితో ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డిజిపిని ఆదేశించినట్లు మీడియా సాధనాల్లో వస్తున్న దృష్ట్యా బండి భగీరథ అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ అంశంపై తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించిందని, ఒక అమ్మాయికి సంబంధించిన అంశం కాబట్టి రాజకీయ పార్టీల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా వాస్తవాలు ఏమిటో పౌర సమాజానికి తెలియజేసే భాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దర్యాప్తు సంస్థ పై ఉందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం నగర నాయకులు పద్మిని వాగ్మారే, శంతా బాయి, భూ లక్ష్మి, బిడిఎస్ఎఫ్ జిల్లా కమిటి సభ్యులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.