28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అందరికీ ఆమోదయోగ్యమైన రాష్ట్ర బడ్జెట్

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

 

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అందరకీ ఆమోద యోగ్యమైనదిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. తాను సలహాదారుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ శాఖలకు తగిన ప్రాధాన్యం లభించేలా ప్రయత్నం చేశానన్నారు. మైనార్టీ శాఖకు రూ.3591 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 40232కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11405 కోట్లు, మూడు లక్షల నాలుగు,వేల 965 కోట్లతో అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసే విధంగా  తెలంగాణ బడ్జెట్ వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్ద పీట వేస్తూ 24439 కోట్లు కేటాయించారని తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమానికి 2862 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, విద్య రంగానికి 28108 కోట్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి నీటిని అందించడానికి నీటిపారుదల శాఖకి 27373 కోట్లు కేటాయించి రైతు పక్షపాతి ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నామని తెలిపారు. పట్టణాభివృద్ధి తో పాటు పల్లెల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పలు పథకాలను ప్రతిపాదించిన రేవంత్ సర్కారు గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం, ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు.  ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీల అమలుకు దాదాపుగా రూ.56084 వేల కోట్లకు పైగా నిధులు ముఖ్యంగా రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లతో కలిపి ఒక్క వ్యవసాయ శాఖకే అత్యధికంగా రూ.43 వేల కోట్లకు పైగా నిధులు, సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి రూ.40 వేల కోట్లు,  విద్యుత్‌ శాఖకు రూ.21221 వేల కోట్లు, వైద్యశాఖకు రూ.12393 వేల కోట్లు నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

More articles

Latest article